లక్ష కోట్లతో  అగ్రి ఇన్​ఫ్రా ఫండ్

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రూరల్​ ఏరియాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశంతో కేంద్రం లక్ష కోట్లతో  ‘అగ్రి ఇన్​ఫ్రా ఫండ్’ ఏర్పాటు చేయనుంది. పదేళ్ల పాటు(2029 వరకు)  ఈ ఫండ్​ అమలులో ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్​భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ మీడియాకు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫార్మ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను బూస్టప్​ చేయడానికి, ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ ఫండ్​ తోడ్పడుతుందన్నారు. ఫార్మ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టులకు ఈ ఫండ్​ నుంచి సబ్సిడీతో లోన్లు అందజేస్తామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, రైతు సంఘాలు, ఫార్మర్​ ప్రొడ్యూసర్​ ఆర్గనైజేషన్లు, అగ్రి ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్​లు, వ్యవసాయ సంబంధ టెక్నాలజీ డెవలపర్లకు ఈ ఫండ్​ ద్వారా సబ్సిడీపై లోన్లు అందజేస్తామని మంత్రి చెప్పారు. ఈ ఏడాది పదివేల కోట్లతో మొదలెట్టి వచ్చే సంవత్సరం నుంచి ఏటా 30 వేల కోట్ల రుణాలు అందజేస్తామని తెలిపారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇటీవల ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఈ ఫండ్​ భాగమని మంత్రి చెప్పారు. ‘ఫండ్​ ఏర్పాటు నిర్ణయం.. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే చరిత్రాత్మక నిర్ణయం’ అని తోమర్​ పేర్కొన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు కోల్డ్​ స్టోరేజీలు, గిడ్డంగులు, ట్రాన్స్​ఫోర్ట్​ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ సదుపాయాలతో రైతులు తమ పంటలకు మంచి ధర పలికే వరకు వేచి చూసే అవకాశం దొరుకుతుందని, ఫుడ్​ వేస్టేజ్​ తగ్గుతుందని మంత్రి వివరించారు. ప్రధాన మంత్రి గరీభ్‌ కల్యాణ్‌ అన్నా యోజన కింద మరో ఐదు నెలల పాటు రేషన్‌ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాగా, ‘ఈ రోజు కేబినెట్​ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలతో చాలా మంది జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి’ అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్​ చేశారు.

కేబినెట్ఇంకొన్ని నిర్ణయాలు..

  • అర్బన్​ మైగ్రేట్స్, నిరు పేదలపై ఇంటి కిరాయి భారాన్ని తగ్గించేందుకు ‘అఫర్డబుల్​ రెంటల్​ హౌసింగ్​ కాంప్లెక్స్’ స్కీముకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద 100 సిటీలలో మరో 1.15 లక్షల సింగిల్​ బెడ్ ​రూమ్​ ఫ్లాట్లు కట్టి, పేదలకు తక్కువ మొత్తానికి రెంట్​కు ఇస్తారు.
  • దేశంలోని ఏడున్నర కోట్ల మంది పేద మహిళలకు ఎల్​పీజీ సిలిండర్లు అందించేందుకు రూ.13,500 కోట్లు.
  •  ఈపీఎఫ్​ చెల్లింపులను మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం.. దీంతో 72 లక్షల మంది ఉద్యోగులకు మేలు కలగనుంది. దీనికోసం
    రూ. 4,800 కోట్లు.
  • ప్రభుత్వ రంగ జనరల్​ఇన్సూరెన్స్  కంపెనీలు మూడింటికి రూ. 12,450 కోట్ల కేటాయింపు

తెలంగాణలో పాలననడవట్లే..సీఎం ప్రగతిభవన్లో ఉండట్లే

Latest Updates