ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు లక్ష చొప్పున నజరానా

  • హర్యానా స్వచ్ఛంద సంస్థ ప్రకటన

దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై పోలీసులకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పోలీస్ జిందాబాద్ అంటూ ఘటనా స్థలంలో గుమ్మిగూడిన జనాలు నినాదాలు చేశారు. వారిపై పూల వర్షం కురిపించారు. దిశకు న్యాయం జరిగిందంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక కాలేజీల్లో విద్యార్థినులు సీపీ సజ్జనార్‌ ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు.

 ఒక్కొక్కరికీ లక్ష నజరానా

హర్యానాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అయితే ఏకంగా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు  నజరానా ప్రకటించింది. హైదరాబాద్ పోలీసులు చేసిన పనిని తాము అభినందిస్తున్నామన్నారు రా గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్. ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున రివార్డు అందజేస్తామని చెప్పారాయన.

MORE NEWS:

నా కొడుకే కాదు..దేశంలో రేపిస్టులందర్నీ ఎన్ కౌంటర్ చేయాలి: ఏ2 శివ తండ్రి

ఆయనా ఓ ఫ్యామిలీ మ్యానే: ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ భార్య

Latest Updates