ఐపీఎల్ సీజన్ పై 10కోట్ల చీర్ లీడర్స్ ఎవరంటే..క్రికెటర్లపై సేహ్వాగ్ సెటైర్లు

కలర్ ఫుల్ క్రికెట్ లీగ్ ఐపిల్ ముగిసింది. ఈ ఐదో ఐపీఎల్ సిరీస్ లో ముంబై ఇండియన్స్ విన్నర్ గా నిలిచారు. అయితే ఐపీఎల్ జరిగే సమయంలో ఇండియన్ మాజీ క్రికెటర్ వీరేంద్ర స్వేహ్వాగ్ ఐపీఎల్ పై వీరూకి బైతక్ పేరుతో  తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ముగిసింది. ముగిసిన తరువాత ఓవరాల్ ఐపీఎల్ సీజన్ లో పలువురు క్రికెటర్లను 10కోట్ల చీర్ లీడర్  అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

ఇందులో ఆర్సీబీ టీం క్రికెటర్ ఆరోన్ ఫించ్,కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గ్లెన్ మ్యాక్స్ వెల్, కోల్ కత్తా నైట్ రైడ్సర్  ఆండ్రీ రస్సెల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ షేన్ వాట్సాన్, ఆర్సీబీ డేల్ స్టెయిన్ గురించి ప్రస్తావించారు.

ఆరోన్ ఫించ్ కు తాను ఠాకూర్ కోహ్లీ అని నిక్ నేమ్ పెడుతున్నట్లు చెప్పిన సెహ్వాగ్..ఆర్సీబీకి శాపం అరోన్ ఫించ్ బ్యాటింగ్ అన్నారు.

ఈ సీజన్లో ఆండ్రీ రస్సెల్ పనితీరు వల్ల కోలకత్తా ప్లే ఆఫ్ లోకి రాలేదన్నారు. ప్రతీ ఇన్నింగ్స్ లో ఆశలు రేకెత్తించడం,ఆడేసమయంలో విఫలమయ్యారని చెప్పాడు.

షేన్ వాట్సన్ ను ఉద్దేశిస్తూ చెన్నై అభిమానులు ఈ డీజిల్ ఇంజిన్ పై  నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ సీజన్లో  కిక్‌స్టార్ట్‌ లు చేసినా బండి స్టార్ట్ కాలేదన్నారు.

గ్లేన్ మ్యాక్స్ వెల్ పంజాబ్ టీమ్ లో 10కోట్ల చీర్ లీడర్ అని తాను నిరూపించారని అన్నారు. అంత ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం దురదృష్టకరమంటూ వ్యంగస్త్రాలు సంధించారు.

డేల్ స్టెయిన్ ను చూసి బయపడే రోజులు పోయాయి.  ఈ సీజన్ లో డేల్ స్టెయిన్ కాస్తా మనం ఇంట్లో వాడే పైప్ గన్ గా మారడని అన్నారు. అతని ఆట తీరును చూసి నేనే నమ్మలేకపోయానంటూ వీరేంద్ర సేహ్వాగ్ సెటైర్లు వేశారు.

Latest Updates