రూ.100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు రద్దు చేయం: RBI

దేశంలో రూ.100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఎప్పటినుంచో చలామణిలో ఉన్నాయి. అయితే ఈ మూడు నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రద్దు చేస్తోందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఆ మూడు రకాల నోట్లు చెల్లుబాటు కావని  వార్తలు వస్తున్నాయి. పాత కరెన్సీ నోట్లు రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ స్పందించింది.

భవిష్యత్తులో రూ.100, రూ.10, రూ.5 నోట్లను రద్దు చేస్తున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది RBI. తమకు అలాంటి ఉద్దేశాల్లేవని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

2016లో రూ.1000, రూ.500 పాత నోట్లను రద్దు చేసిన కేంద్రం… రూ.100, రూ.10, రూ.5 నోట్ల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే, 2018లో రూ.10, రూ.50తో పాటు కొత్తగా రూ.200 నోట్లను ముద్రించిన RBI… 2019లో సరికొత్త రూ.100 నోట్లను తీసుకువచ్చింది.

Latest Updates