ఇళ్లు ఖాళీ చేయకపోతే రోజుకు 10 వేల ఫైన్

మంత్రుల వేతన సవరణ బిల్లులో రాజస్థాన్ సర్కారు

జైపూర్: మాజీలుగా మారినా ప్రభుత్వం కేటాయించిన ఇళ్లు ఖాళీ చేయని నేతలు రోజుకు రూ.10 వేల చొప్పున ఫైన్​ చెల్లించాల్సిందేనని రాజస్థాన్​ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాజస్థాన్​ మినిస్టర్స్​ శాలరీస్(సవరణ) బిల్లు 2019 కు సభ ఆమోదం తెలిపింది. పదవి కోల్పోయిన మంత్రులు రెండు నెలల్లోగా అధికారిక నివాసాలను ఖాళీ చేయాలి. అయితే, చాలామంది నేతలు ఈ రూల్​ను లెక్కచేయడంలేదు. గడువు తర్వాత నెలకు రూ.5 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. దీంతో కొత్త మంత్రులకు ఇళ్లు కేటాయించడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పదవి కోల్పోయినా అధికారిక భవనాలను అంటిపెట్టుకుని ఉండే నేతల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా సవరణ బిల్లును శుక్రవారం పాస్​చేసింది. ఈ బిల్లు చట్టంగా మారితే.. రెండు నెలల్లోగా భవనాలను ఖాళీ చేయకుంటే బలవంతంగా ఖాళీ చేయించే పవర్​ను అధికారులకు కట్టబెట్టింది.

Latest Updates