జియో ఫైబర్ లో రూ.11,200 కోట్లు

రిలయన్స్ తో ఖతర్ ఇన్వెస్ట్ మెంట్ చర్చలు

న్యూఢిల్లీ: జియో ఫైబర్ లో రూ.11,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఖతర్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ(క్యూఐఏ) చర్చలు జరుపుతోంది. ఈ డీల్ పై రిలయన్సు తో సావరీన్ ఫండ్ జరుపుతోన్న చర్చలు తుది దశకు వచ్చాయని తాజా రిపోర్టులు చెప్పాయి. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇప్పటికే జియో ప్లాట్ ఫామ్ లో వాటాలు అమ్మడం ద్వారా 20 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించింది.

డజనుకు పైగా కంపెనీలు క్వాల్ కామ్ వెంచర్స్, ఫేస్ బుక్, గూగుల్, ఇంటెల్ క్యాపిటల్ అబుదాబికి చెందిన రెండు సావరీన్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు, సిల్వర్ లేక్, విస్టా, ఈక్విటీ పార్ట్ నర్స్, జనరల్ అట్లాంటికా, కేకేఆర్, టీపీజీ, సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్లు జియోలో పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం జియో డిజిటల్ ఫైబర్ కిందనున్న  ఫైబర్ ఆస్తులను మోనిటైజ్  చేయాలని కంపెనీ చూస్తోంది.

Latest Updates