పెట్రోల్, డీజిల్ పై రూ.2.50 తగ్గించిన కేంద్రం

ఢిల్లీ : అడ్డు, అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్ల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొంతమేర తగ్గించింది. లీటర్‌పై రూ.2.50 తగ్గిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ప్రకటించారు. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. కేంద్రం తగ్గించిన దానికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాయన్న నమ్మకం ఉందని జైట్లీ అన్నారు. లీటర్‌పై రాష్ట్రాలు కూడా రూ.2.50  తగ్గిస్తే సుమారు రూ.5 వరకు వినియోగదారులకు ప్రయోజనం ఉంటుందన్నారు. తాజా తగ్గింపుతో… కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్ల ఆదాయం కోల్పోతుందని చెప్పారు జైట్లీ.

ఎక్సైజ్ డ్యూటీ రూపాయిన్నర … మైనింగ్ కంపెనీలు ఒక రూపాయి తగ్గించడంతో.. మొత్తం రెండున్నర రూపాయలు తగ్గుతుందని జైట్లీ అన్నారు. పెట్రో భారాన్ని తగ్గించాలన్న ప్రధాని మోడీ సూచనతో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైట్లీ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates