AP,TS రాష్ట్రాల్లో రూ.2వేల కోట్ల అవకతవలు: ఐటీశాఖ

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఐటీ సోదాల గురించి ఆదాయపు పన్నుల శాఖ ప్రకటన విడుదల చేసింది. సుమారు రూ.2 వేల కోట్ల అవకతవకలు జరిగినట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణలోని 3 ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు నిర్వహించామని, మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులు గుర్తించినట్లు తెలిపింది. రెండు రాష్ట్రాల్లో చేసిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయని, లెక్కలు చూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల నగలు లభ్యమయ్యాయన్నారు. పలువురికి చెందిన 25కు పైగా బ్యాంకు లాకర్లను సోదాల్లో గుర్తించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

 

Latest Updates