హైదరాబాద్ నగరానికి రూ.20 వేల కోట్లు ఇచ్చేలా చూడాలి

హైదరాబాద్‌ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు అమలు చేస్తున్న జీహెచ్‌ ఎంసీ నిధుల సేకరణపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. బాండ్ల,రుణాల రూపంలో పెద్ద మొత్తంలో సమూర్చుకుంటున్నబల్దియా ఆర్థిక సంఘం నిధుల కోసమూ ప్రతిపాదనలు సమర్పించింది.మంగళవారం నంద కిషోర్ సింగ్ అధ్యక్షతన సిటీలో పర్యటించి న 15వ ఆర్థిక సంఘం ప్రతినిధి బృందంతో జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌‌ దానకిశోర్‌‌ నేతృత్వం లోని అధికారుల బృందం ప్రత్యేకంగా  సమావేశమైంది. జీహెచ్‌ ఎంసీలో చేపడుతున్న అభివృద్ధి పనులకు నిధులు భారీగా వచ్చేలా సి ఫార్సులు చేయాలని అధికారులు కోరారు. ఈ మేరకు ప్రతిపాదనల్ని సమర్పించారు. ముఖ్యం గా ఎస్‌ ఆర్‌‌డీపీ పరిధిలో చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌‌ పాస్‌ లకు నిధులు అవసరమని తెలిపారు. నగరం విస్తరిస్తున్న నేపథ్యం లో మౌలిక వసతుల్ని మెరుగుపర్చు కోవాల్సి ఉందన్నారు. ట్రాఫిక్‌ వ్యవస్థను చక్కదిద్దుకోవడంలో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నట్టు పేర్కొన్నా రు. ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌ ‌పోర్ట్‌‌ సిస్టమ్‌ , రోడ్డు భద్రత, రక్షణ చర్యల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నట్టు వివరించారు.అండర్‌‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ, వర్షపు నీటి డ్రెయిన్‌‌ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. మేజర్‌‌ రోడ్లు, లింక్‌ రోడ్ల నిర్మాణం,మరమ్మతులు, స్ట్రీట్ లైటింగ్‌‌ కోసం తీసుకుంటున్న వినూత్న చర్యలు, పీపీపీ పద్ధతిలో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ గురించి వివరించారు. మేజర్‌‌ పార్కు లు, కాలనీ పార్కులు, బయో డైవర్సిటీ పార్కులు, నర్సరీ సెంటర్‌‌ల అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్నట్టు వివరిం చారు. మహిళా సాధికారత,జీవన విధానం మెరుగుపర్చడం, వికాసం కార్యక్రమంలో భాగంగా దివ్యాం గులు, సీనియర్‌‌ సిటి జన్‌‌ల సంక్షేమం కోసం రూపొందించిన కార్యక్రమాల్ని నివేదించారు. సిటీ సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్ని,అనుసరిస్తున్న ప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకు ని 2020-నుంచి 2025 వరకు సుమారు రూ.20 వేల కోట్ల నిధులను కేటాయించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

Latest Updates