సీఎం రిలీఫ్ ఫండ్ కు నిర్మాత‌ల మండ‌లి విరాళం

లాక్ డౌన్ క్ర‌మంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు ప‌లువురు విరాళాలు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు సినీ స్టార్స్, ప్ర‌ముఖులు విరాళాలు ఇవ్వ‌గా.. బుధ‌వారం నిర్మాత‌ల మండ‌లి కూడా విరాళం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది.

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరుకు మేముసైతం అంటూ తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ. 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించింది. ఈ విరాళం చెక్కును ప్ర‌ముఖ నిర్మాత సూప‌ర్ కృష్ణ త‌మ్ముడు జి.ఆదిశేష‌గిరి రావు ఆధ్వ‌ర్యంలో ప‌లువురు నిర్మాత‌లు క‌లిసి మంత్రి కేటీఆర్ కు అంద‌జేశారు.

Latest Updates