ఇంటర్‌ పాసైతే రూ.25 వేలు, డిగ్రీ పాసైతే రూ.50 వేలు: నితీష్ కుమార్

బీహార్‌ ఎన్నికల నగరా మోగడంతో తాయిళాలు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించేవారికి ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అంతేకాదు..ఇంటర్‌ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని తెలిపారు నితీశ్. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ సంస్థలు ఆ శాఖ కిందకు వస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు సీఎం నితీశ్ కుమార్.

Latest Updates