హైద‌రాబాద్‌లో రూ. 3.50 కోట్లు స్వాధీనం

Rs. 3.50 crores seized in Hyderabad Banjarahills

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ మూడున్నర కోట్ల రూపాయిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 8 మందిని అరెస్టు చేశారు. నగల వ్యాపారి అనిల్‌ అగర్వాల్‌ ఇంట్లో ఈ నగదు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు.. దాదాపు మూడున్నర కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదును బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల్లో అభ్యర్థులకు ఇవ్వడానికి ఈ డబ్బు దాచినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రకాశ్‌ అనే వ్యక్తికి అనిల్‌ అగర్వాల్‌ కోటి రూపాయిలను ఇచ్చాడు. హవాలా ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితులు ఈ రోజు మ‌ధ్యాహ్నం 3 గం.ల‌కు మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు సీపీ అంజ‌నీ కుమార్ తెలిపారు.

Latest Updates