
ముషీరాబాద్, వెలుగు: సదర్ సమ్మేళనంలో హర్యానా నుంచి తీసుకువచ్చిన దున్న రాజా (ఏకే47) సెంటర్ ఆఫ్అట్రాక్షన్గా నిలిచింది. దీని ధర దాదాపు రూ. 3 కోట్లకు పైగానే ఉంటుందని యజమాని తెలిపారు. హర్యానా నుంచి దీన్ని స్పెషల్ వాహనంలో ముగ్గురు పనివాళ్లు, మేనేజర్‌తో కలిసి తీసుకురావడానికి 4 రోజులు పట్టింది. ఇందుకు రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇది తినే తిండి దగ్గరి నుంచి ప్రతీది మేనేజర్‌తోపాటు ముగ్గురు ట్రైనర్లు మానిటర్ చేస్తారని చెప్పారు. రోజూ ఖాజు, బాదం పిస్తాతో పాటు యాపిల్స్, ఇతర ఫ్రూట్స్పెడతారు. ఒక్కరోజు తిండి ఖర్చే రూ. 28 వేలు ఉంటుందని కేర్‌టేకర్ తెలిపారు. రోజూ స్పెషల్ఎక్సర్ సైజ్లు, మసాజ్ చేయిస్తామన్నారు. దీని కోసం పనిచేసే వాళ్లకు నెలకు రూ.లక్ష పైనే జీతాలు ఇస్తామని చెప్పారు. దీంతో ఈ దున్న ముందు సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీ పడ్డారు. ఏకే 47తో పాటు తెలంగాణకు చెందిన పదుల సంఖ్యలో దున్నలను యాదవుల సదర్ సమ్మేళనానికి తీసుకువచ్చారు.