3 ఆటోమొబైల్ కంపెనీలకు రూ.3 లక్షల కోట్ల దెబ్బ

Rs 3 lakh crore gone, yet more pain ahead for auto stocks
  • భారీగా కుప్పకూలిన ఆటో సూచీ
  • అమ్మకాల దెబ్బతో స్టాక్స్‌‌ పతనం

ముంబై : మన ఈక్విటీ మార్కె ట్‌ లో ఆటో రంగం షేర్లు కుప్పకూలాయి. అమ్మకాలు తగ్గడంతో స్టాక్‌మార్కెట్‌ లో ఆటో స్టాక్స్ కిందకు జారుతున్నాయి.గత 16 నెలల్లో దేశీయ ఆటోమొబైల్‌‌‌‌ కంపెనీల మార్కెట్‌ వ్యాల్యూ రూ.2,91,238 కోట్లు (42బిలియన్ డాలర్లు) వరకు తుడిచి పెట్టుకుపోయింది. 2017 డిసెంబర్ నెలలో గరిష్ట స్థాయిలను అందుకున్న ఈ స్టాక్స్ , ఆ తర్వాత కాలంలో 30 శాతం వరకు పతనమయ్యాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ లో ఉన్న 19 రంగాల సూచీల్లో ఆటో సూచీనే వరస్ట్ ఫర్‌ఫార్మర్‌ గా నిలిచింది. ఇదే సమయంలో బీఎస్‌ ఈ సెన్సెక్స్ ఇండెక్స్ సరికొత్త గరిష్టాలకు చేరింది. బ్యాంకింగ్ సిస్టమ్‌ లో నగదు కొరత,వినియోగంపై పడింది. వినియోగం తగ్గడంతో,కారు తయారీదారులు చాలా వరకు తమ వెహికిల్స్‌ ను అమ్ముకోలేక పోయారు. గతేడాది వరకు కూడా మన ఆటో మార్కెట్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతోన్న ఆటో మార్కెట్‌ ల్లో ఒకటిగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. మారుతీ సుజుకీ లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, మహింద్రా అండ్ మహింద్రా వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఈ ఏడాది  సెన్సెక్స్‌ లో భారీగా పడిపోయాయి. ఈ కంపెనీలు ఏకంగా 20 శాతం వరకు నష్టపోయాయి.

అంచనా వేసిన దాని కంటే ఎక్కువగానే ఆటోమొబైల్‌‌‌‌ స్టాక్స్ బలహీనంగా ఉన్నాయని నోమురా హోల్డింగ్స్ ఇంక్ ఎనలిస్టులు కపిల్ సింగ్ , సిద్ధార్థ అన్నారు. మార్చి2019తో ముగిసిన ఆర్థికసంవత్సరంలో ప్యాసెంజర్ వెహికిల్ గ్రోత్ బాగాతగ్గిందని, 2014 తర్వాత తక్కువ వృద్ధి నమోదవడం ఇదే మొదటిసారని సియామ్ తెలిపింది.బీఎస్‌ ఈ ఆటో ఇండెక్స్‌ లో ఉన్న 16 కంపెనీల్లోకేవలం రెండు కంపెనీలు మాత్రమే లాభాలు సం-పాదిం చాయి. ఒకటి టాటా మోటార్స్ లిమిటెడ్,2011 నాటి కనిష్ట స్థా యికి పడిపోయిన తర్వాతఈ కంపెనీ స్టాక్ గత నెలలో కోలుకుంది.మరొకటి బజాజ్ ఆటో లిమిటెడ్. టూ, త్రీ వీలర్స్అమ్మకాలు పెరగడంతో ఈ కంపెనీ షేర్లు 11శాతం వరకు పెరిగాయి. ఆటోమొబైల్‌‌‌‌ రంగానికి స్వల్ప కాలంలో ఎలాంటి ఊరట ఉంటుందని భావించడం లేదని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. తమ అమ్మకాల క్షీణత సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని ఆటో కంపెనీలు,టూ వీలర్స్ తయారీదారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలు బలహీనంగానే ఉంటుందని మారుతీసుజుకి  చైర్మన్ ఆర్‌ సీ భార్గవ చెప్పా రు. సెకండాఫ్‌ లో గ్రోత్ మళ్లీ పుంజుకుంటుం దని, బీఎస్‌ 6నిబంధనల అమలుకు ముందు ప్రీ బయింగ్ చోటు చేసుకుంటుందని తెలిపారు. కొత్త ఎమిషన్స్ నిబంధనల అమలుకు ముందు కొనుగోళ్లు కొంత జోరందుకుంటాయని టీవీఎస్ మోటార్స్ స్కూడా అంచనావేస్తోంది. దివాళి  ఫెస్టివల్ సీజన్ కూడా అమ్మకాలను పెంచుతుందని అభిప్రాయపడుతోంది. అయితే ఆటో కంపెనీలు ప్రస్తుతం మందగమనంలో ఉన్నప్పటికీ, ఇంకా ఈ కంపెనీలు ఆర్‌ అండ్‌ డీలో పెట్టుబడులు పెట్టేందుకు, ఇన్వెంటరీలను మేనేజ్ చేసేందుకే కట్టుబడి ఉన్నాయని విశ్లేషకులు పేర్కొ న్నారు. వారు ఆకర్షణీయమైన ప్రొడక్ట్‌‌‌‌లతోనే మార్కెట్‌ లోకి వస్తున్నట్టు చెప్పారు.

Latest Updates