రూ.35 లక్షల నకిలీ నోట్ల చెలామణి : 9మంది అరెస్ట్

నెల్లూరు జిల్లా : నకిలీ నోట్లు ముద్రించి, చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు ఏపీ నెల్లూరు జిల్లా పోలీసులు. ఏలూరుకు చెందిన మురళీకృష్ణ, కర్నూలు జిల్లాకు చెందిన రాములు, రాజస్థాన్ కు చెందిన ప్రేమదాస్ లు ముఠాగా ఏర్పడి.. నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఏలూరులోని జంగారెడ్డిగూడెంలోని ఓ ఇంట్లో  నెలన్నర నుంచి దొంగనోట్లు తయారు చేస్తున్నారని చెప్పారు. 35 లక్షల నకిలీ నోట్లను మారుస్తుండగా కాకు శ్రీను, మౌలాలీతో సహా 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.  మొత్తం 34 లక్షల 19 వేల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates