ఒకే దఫాలో రూ.4 వేలు: ఎన్నికల ముందే కేంద్ర ‘రైతు సాయం‘

  • రెండు వాయిదాల మొత్తం ఒకేసారి అందజేత

న్యూఢిల్లీ: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే రైతుల్ని ప్రసన్నం చేసుకునే ఎత్తుగడను ప్రధాని మోడీ అమలుచేయనున్నట్లు తెలిసింది. ఇటీవలే ప్రకటించిన ‘పీఎం కిసాన్ ’ సాయం రెండు వాయిదాల మొత్తాన్ని (రూ.4వేలు) ఒకేసారి రైతుల అకౌంట్లో వేయనున్నట్లు సమాచారం. మధ్యం తర బడ్జెట్ లో ప్రకటిం చిన ‘పీఎం కిసాన్ ’ నిబంధనల ప్రకారం రూ. 6 వేలను మూడు దఫాలుగా రైతుల అకౌంట్లోకి వేస్తారు. అయితే ఎన్నికల దృష్ట్యా రెండు దఫాల సాయాన్ని ఒకేసారి విడుదల చేసేం దుకు సన్నాహాలు జరుగుతున్నట్లు కేం ద్ర వ్యవసాయ శాఖ ముఖ్య అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈనెల24న గోరఖ్ పూర్ లో మోడీ ‘పీఎం కిసాన్’ను అధికారికంగా ప్రారంభిం చనున్నారు. ఈ పథకం ద్వారా ఐదెకరాలకంటే తక్కువ భూమి ఉన్న సుమారు 12 కోట్ల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వ అంచనా.

Latest Updates