ట్యాక్స్​ లెక్కల్లో తేడాలున్నయని​ 5 కోట్లు లంచం అడిగిన్రు

ఇద్దరు జీఎస్టీ ఆఫీసర్లపై సీబీఐ కేసు

హైదరాబాద్‌‌, వెలుగు: జీఎస్టీలో ట్యాక్స్ ఎగవేతల నివారణ విభాగానికి చెందిన ఇద్దరు ఆఫీసర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇన్‌‌పుట్‌‌ క్యాష్​ క్రెడిట్‌‌లో రూ.5 కోట్లు డిమాండ్‌‌ చేశారన్న ఆరోపణలపై ట్యాక్స్ ఎవాషన్ సర్వీసెస్ డిప్యూటీ కమిషనర్‌‌‌‌ చిలక సుధారాణి, సూపరింటెండెంట్‌‌ బొల్లినేని శ్రీనివాస గాంధీపై కేసును దర్యాప్తు చేస్తోంది. జీఎస్టీ విజిలెన్స్‌‌ ఫిర్యాదుతో గతేడాది అక్టోబర్‌‌‌‌31న సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ట్యాక్స్ చెల్లింపుల్లో మోసానికి సంబంధించి ఇన్‌‌ఫినిటీ మెటల్‌‌ ప్రొడక్ట్స్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ గ్రూప్ ఆఫ్‌‌ కంపనీస్‌‌ డైరెక్టర్‌‌‌‌ సత్య శ్రీధర్‌‌‌‌రెడ్డిపై సుధారాణి కేసు రిజిస్టర్‌‌‌‌ చేసింది. ఈ కేసులో గతేడాది మార్చి 6న ఆయన అరెస్టై అదే నెల 29న రిలీజ్‌‌ అయ్యాడు.  శ్రీధర్‌‌‌‌రెడ్డికి చెందిన హైదరాబాద్‌‌ స్టీల్స్‌‌పై కూడా కేసు పెడతామని.. ఆయన భార్య రాఘవిరెడ్డిని అరెస్ట్‌‌ చేస్తామని సుధారాణి, గాంధీ బెదిరించారు. తన భార్యను అరెస్ట్ చేయొద్దంటూ శ్రీధర్ రెడ్డి రూ.5 కోట్లకు డీల్‌‌ సెట్‌‌ చేసుకున్నాడు. గతేడాది ఏప్రిల్15న రూ.10 లక్షలు ఇచ్చాడు. మిగిలిన రూ.4.9 కోట్లకు ఓపెన్ ల్యాండ్స్‌‌, ప్లాట్స్‌‌ తమ పేరుపై రిజిస్టర్‌‌‌‌ చేయాలని సుధారాణి, గాంధీ డిమాండ్ చేశారని జీఎస్టీ విజిలెన్స్ విభాగం గుర్తించి, సీబీఐకి కంప్లయింట్ ఇచ్చింది. కేసులో మరికొందరు జీఎస్టీ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.

For More News..

కరోనా ప్రికాషన్స్​తో నీట్‌.. తామిచ్చిన మాస్కులే పెట్టుకోవాలన్నఅధికారులు

రోడ్డు మధ్యలో మంత్రి ప్రోగ్రాం.. దారి మళ్లిన అంబులెన్స్

రెండున్నరేళ్ల కిందటి ‘రైతుబంధు’ ఇప్పుడిచ్చిన్రు

Latest Updates