చార్మినార్ దగ్గర రూ.66 లక్షల బంగారం సీజ్

హైదరాబాదులో అక్రమంగా అ బంగారం రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. అతడి దగ్గర నుంచి రూ.66 లక్షల 64 వేల విలువైన గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

సిటీలో బంగారం స్మగ్లింగ్ గురించి పక్కా సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా వేశారు. బుధవారం చార్మినార్ దగ్గరలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా అనిపించడంతో అడ్డుకుని చెక్ చేశారు. అతడి దగ్గర ఉన్న బ్యాగులు రూ.66,64,000 విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates