దుబాయ్‌లో మనోడికి 7 కోట్ల జాక్ పాట్‌

దుబాయ్: దుబాయ్ లక్కీ డ్రాలో తెలంగాణకు చెందిన వ్యక్తి విజేతగా నిలిచాడు. లక్ష్మీ వెంకటా టాటా రావు గ్రంధి లక్కీ డ్రా కాంటెస్ట్‌లో రూ.7.3 కోట్లు గెలుచుకున్నాడని గల్ఫ్​ న్యూస్ గురువారం వెల్లడించింది. ఏడాది క్రితం దుబాయ్ వెళ్లిన ఆయన అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ‘‘ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దుబాయ్కి థ్యాంక్స్. దీనితో ఇండియాలో నాకు, నా ఫ్యామిలీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ” అని టాటా రావు గ్రంధి చెప్పారు. దుబాయ్‌లో 1999 నుంచి ‘‘మిలీనియమ్ మిలియనీర్” పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. దీని కింద 1 మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.7.3 కోట్లు ) ప్రైజ్ మనీగా ఇస్తున్నారు.

For More News..

చెట్టు కింద ఆపరేషన్!

రూంమేట్‌కి లొకేషన్ షేర్ చేసి.. సూసైడ్ చేసుకున్న లవర్స్

ఇంట్లో పాత సామాను తీస్తుంటే.. రూ. 95 లక్షల విలువైన మగ్గు దొరికింది

Latest Updates