ట్విట్టర్‌లో చేసిన ఫస్ట్ ట్వీట్​కు రూ.73 లక్షలు

ట్విట్టర్‌లో చేసిన ఫస్ట్ ట్వీట్​కు రూ.73 లక్షలు

న్యూఢిల్లీ: ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే 15 ఏళ్ల కిందట చేసిన తన మొదటి ట్వీట్‌‌ను అమ్మకానికి పెట్టారు. ఈ ట్వీట్‌‌ను లక్ష డాలర్లకు(రూ. 73 లక్షలు) కూడా కొనేందుకు బిడ్స్ వచ్చాయి. ‘జస్ట్‌‌ సెట్టింగ్‌‌ అప్‌‌ మై ట్విటర్‌‌‌‌’ అనే ట్వీట్‌‌ను వాల్యుబుల్స్‌‌ వెబ్‌‌సైట్‌‌లో  డోర్సే అమ్మకానికి పెట్టారు. ఈ ట్వీట్‌‌ను  నాన్‌‌ ఫంగబుల్‌‌ టోకెన్స్‌‌(ఎన్‌‌ఎఫ్‌‌టీ) గా లిస్ట్‌‌ చేశారు. ఫోటోలు, వీడియోలు, ఇతర ఆన్‌‌లైన్ మీడియాను ఎవరికి చెందిందో చెప్పే డిజిటల్‌‌ ఫైల్‌‌ను ఎన్‌‌ఎఫ్‌‌టీ అంటారు. తన మొదటి ట్వీట్‌‌ను అమ్ముతానని కిందటేడాది డిసెంబర్‌‌‌‌లో డోర్సే  పేర్కొన్నారు. కానీ, ఆయన ట్వీట్‌‌ను వాల్యుబుల్స్‌‌లో లిస్ట్ చేశాక ఈ ఇష్యూ బాగా పాపులరయ్యింది. ట్వీట్‌‌ లిస్ట్‌‌ అయిన కొన్ని నిమిషాల్లోనే 88,888.88 డాలర్లను ఇచ్చేందుకు యూజర్లు ముందుకు రావడం విశేషం.  ఈ ట్వీట్‌‌ను కొనే వారికి ఆటోగ్రాఫ్ చేసిన డిజిటల్ సర్టిఫికేట్‌‌, ఒరిజినల్ సర్టిఫికెట్‌‌కు చెందిన మెటాడేటా వంటివి ఇస్తామని వాల్యుబుల్స్ పేర్కొంది.