బారికేడ్ల వల్ల ప్రమాదం.. రూ.75 లక్షల పరిహారం చెల్లించాలన్న హైకోర్టు

రోడ్డుపై పెట్టిన బారికేడ్ల వల్ల ప్రమాదానికి గురై.. లేవలేని స్థితిలో ఉన్న యువకుడికి రూ. 75 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీలో పోలీసులు రోడ్డుపై పెట్టిన బారికేడ్ల వల్ల ఒక యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ కేసుకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం వల్లే యువకుడు ప్రమాదానికి గురయ్యాడని కోర్టు పేర్కొంది. బాధితుడికి నష్టపరిహారం కింద రూ. 75 లక్షలు చెల్లించాలని జస్టిస్ నవీన్ చావ్లా తీర్పు చెప్పారు.

డిసెంబర్‌ 2015లో ఒకనాటి తెల్లవారుజామున ధీరజ్ కుమార్ అనే 21 ఏళ్ల యువకుడు తన తండ్రితో కలిసి మోటారుసైకిల్ పై ఇంటికి వెళ్తున్నాడు. వారు వెళ్తున్న రోడ్డు మీద పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టారు. తెల్లవారుజామున చీకటిగా ఉండటంతో తండ్రీకొడుకులు బారికేడ్లను ఢీకొట్టారు. ఆ ప్రమాదంలో ధీరజ్ కు తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యాడు. ఎన్నో శస్త్రచికిత్సలు చేసినా లాభం లేకపోయింది. ధీరజ్ తీవ్ర గాయాలవల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

కొడుకు మంచానా పడటం, వైద్యానికి డబ్బులు బాగా ఖర్చవడంతో ధీరజ్ తండ్రి పరిహారం ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ఆ కేసును స్వీకరించిన కోర్టు పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావించి రూ. 75 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

‘కేసు యొక్క వాస్తవాలు మరియు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నష్ట పరిహార చట్టాన్ని అనుసరించి పిటిషనర్లకు ఢిల్లీ పోలీసులు డబ్బు చెల్లించాలి. ఈ మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వద్ద నాలుగు వారాల్లో జమ చేయాలి’ అని కోర్టు ఆదేశించింది.

పోలీసులు మాత్రం ధీరజ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వాధించారు. అంతేకాకుండా.. ధీరజ్ కుమార్ బారికేడ్లను తప్పించుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ గొలుసును గమనించలేదని పోలీసులు అంటున్నారు. ఆ గొలుసు వల్లే వారు కిందపడ్డారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో వారు హెల్మెట్ ధరించలేదని పోలీసులు తెలిపారు.

For More News..

గాడ్సే దేశభక్తుడే.. నేరాన్ని సమర్థించలేదు..

వీడియో: కొడుకుకు హెయిర్ కట్ చేసిన సచిన్ టెండూల్కర్

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి

Latest Updates