రూ. లక్షన్నర విలువ చేసే గంజాయి పట్టివేత

సంగారెడ్డి జిల్లా : సీక్రెట్ గా గంజాయిని తరలిస్తున్న టీమ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, BHELలో జరిగంది. వీరు వైజాగ్ నుండి బీదర్ కి లక్షన్నర రూపాయల విలువ చేసే 10 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు SOT పోలీసులు.

రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని BHEL క్రాస్ రోడ్ దగ్గర వాహనాలు తనిఖీలు చేయగా..ఈ గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి పాతనేరస్థుడని తెలిపారు రామచంద్రపురం పోలీసులు.

Latest Updates