గుడ్ న్యూస్: ST విద్యార్థులకు రూ.50 వేల గ్రాంట్

ST విద్యార్థులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న ST విద్యార్థులు రూ.50 వేల గ్రాంట్ పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలంది గిరిజన సంక్షేమశాఖ. మెడిసిన్, ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సులు అభ్యసిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్‌షిప్‌లు ఏవీ పొందనివారే ఈ గ్రాంట్‌కు అర్హులని చెప్పింది. దరఖాస్తులను హైదరాబాద్ మాసబ్‌ ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని కోరింది.

 

Latest Updates