NRC ఫైనల్ లిస్టుపై RSS సలహా

పుష్కర్ (రాజస్థాన్): అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) ఫైనల్ లిస్టులో కొన్ని తప్పులు ఉన్నాయని,  ప్రభుత్వం వాటిని తొలగించాకే ముందుకు సాగాలని ఆర్ఎస్ఎస్  డిమాండ్ చేసింది. ఫైనల్ లిస్టులో  కొందరు నిజమైన పౌరులకు చోటు దక్కలేదని చెప్పింది. రాజస్థాన్ లోని పుష్కర్ లో ఆర్ఎస్ఎస్ మూడురోజులపాటు సమావేశమైంది. చివరి రోజైన సోమవారం ఆ సంఘం  జాయింట్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబాళె  మీడియాతో మాట్లాడారు. 35 లక్షల నుంచి 40 లక్ష ల మంది అక్రమ వలసదారులు అసోంలో ఉన్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు వారికి అన్ని లీగల్ డాక్యుమెంట్లు జారీ చేశాయని, అందుకే  ఎన్ఆర్ సీ సంక్లిష్టంగా మారిందన్నారు. “ఎన్ఆర్సీ ఫైనల్ లిస్టు చట్టం కాదు. దాంట్లో తప్పులు ఉన్నాయి. వాటిని సర్కారు తొలగించాలి”  అని అన్నారు. ఎన్ఆర్సీ ఫైనల్ జాబితాలో చోటు దక్కని 19 లక్షల మందిలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో సామాజిక, ఆర్థిక తేడాలు ఉన్నంతవరకు రిజర్వేషన్ల అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. రిజ ర్వేషన్ల అవసరం ఉందని లబ్ధిదారులు భావించేంతవరకు వాటిని కొనసాగించాలంది.

 

Latest Updates