అద్దింట్లో ఆర్టీఏ ఆఫీసు…ఇబ్బందుల్లో వాహనదారులు

హైదరాబాద్ లోని  కూకట్ పల్లి రవాణా శాఖ కార్యాలయం గత కొన్ని సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం ప్రారంభమైన మొదట్లో ప్రాథమిక సేవలు అందించేవారు.రోజు రోజుకు ఆఫీస్​వచ్చే వినియోగదారుల సంఖ్య పెరగడంతో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అన్ని సేవలు ఇక్కడే అందిస్తుం డడంతోఅద్దె ఇంట్లో కొనసాగుతున్న కార్యాలయంలో అధికారులు సిబ్బంది అవస్థలు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు.

అన్నీ సమస్యలే….

కూకట్ పల్లి నియోజకవర్గం లోని కేపీహెచ్ బీకాలనీ నాల్గవ ఫేజ్ లోని ఎంఐజీ భవనంలో 20 07 సంవత్సరంలో ఉన్నతాధికారులు కూకట్ పల్లి ప్రాంత వాసుల కోసం ఆర్టీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూకట్ పల్లి నియోజకవర్గం లోని బాలానగర్,కూక ట్ పల్లి మండల పరిధిలోని కేపీహెచ్ బీకాలనీ, బాలాజీనగర్, ఫతేనగర్, బాలానగర్,మూసాపేట్, హైదర్ నగర్ ,శంషీగూడ ప్రాంత వాసులు ఇక్కడే రిజిస్ర్టేషన్ , టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనదారులు లెర్నింగ్ లైసెన్సు సేవలు పొందుతున్నారు. అద్దె ఇంట్లో కొనసాగుతున్న కార్యాలయంలో ఇరుకుగా ఉండడంతో సేవల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయ సిబ్బంది ఇరుకు గదుల్లోనే విధులు నిర్వహిస్ తున్నారు. ఆఫీస్​ఆవరణలో ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేకపోవడంతో ఎండలోనే నిలబడి సేవలు పొందుతున్నారు. ఇక్కడకు వచ్చే వారి వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్ల వెంబడి వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోం టున్నారు. కార్యాలయంలో సరైన సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరిన పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

ట్రయల్ రన్ కోసం మరో ఆఫీస్….

కూకట్ పల్లి ఆర్టీఏ కార్యాలయంలో వాహనదారుల శాశ్వత లైసెన్సు కోసం దగ్గరలో ఉన్న మేడ్చల్ జిల్లా కార్యాలయానికి వెళ్తున్నారు. ఇక్కడ ట్రాక్ నిర్మాణం చేపడితే ఇక్కడే వాహనాల ట్రయల్ ద్వారా లైసెన్స్ పొందవచ్చు. దీనిపై ప్రజాప్రతినిధులు, రవాణా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని అధికారుల తీరును ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి కూకట్ పల్లిలో ఆర్టీఏ కార్యాలయానికి సొంత భవనం నిర్మించి ట్రాక్ నిర్మాణం చేపడితే బాగుంటుందని వినియోగదారులు కోరుతున్నారు.

Latest Updates