RTC బంద్ ను విరమించుకోవాలి : మహేందర్ రెడ్డి

mahendra-reddyఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె నిర్ణయంపై స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 11 నుంచి పిలుపునిచ్చిన బంద్ ను విరమించుకోవాలని కార్మిక సంఘాలను కోరింది. దీనిపై మాట్లాడేందుకు చర్చలకు రావాలని ఆహ్వానించారు రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి. TMU తో పాటు గుర్తింపు పొందిన సంఘాల నేతలను సమావేశానికి రావాలన్నారు.

శుక్రవారం (జూన్-8) ఉదయం సెక్రటేరియట్ లో భేటీ జరగనుంది. ఐతే 50 శాతం… వేతన సవరణ చేయనిదే సమ్మెపై వెనక్కి తగ్గమంటోంది TMU. వేతన సవరణతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు.

Posted in Uncategorized

Latest Updates