RTC బస్సు కింద పడి వ్యక్తి మృతి

పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖని RTC డిపోలో విషాద సంఘటన జరిగింది. సోమవారం (అక్టోబర్-1) డిపోలో బస్ పార్కింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు వెనుక ఊడుస్తున్న స్వీపర్‌ ను చూసుకోకుండా డ్రైవర్ వెనుకకు రివర్స్ తీయడంతో.. బస్సు కిందపడి స్వీపర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates