అడవిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ములుగు జిల్లా:  ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు అడవిలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన సోమవారం ములుగు జిల్లాలో జరిగింది. తాడ్వాయి- పస్రా గ్రామాల మధ్యగల అడవిలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. మంగపేట మండలం తిమ్మంపేట నుంచి హన్మకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు( AP 36 Z 0186), వెనుక నుంచి వస్తున్న కారుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పింది.

దీంతో రోడ్డు దిగి అడవిలోకి దూసుకెల్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. చెట్లు అధికంగా ఉండడంతో ప్రాణనష్టం జరగలేదు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సు నడిపింది రెగ్యులర్ డ్రైవరా..తాత్కాలిక డ్రావరా అనే విషయం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Latest Updates