ఆర్టీసీ బస్సు ఢీకొట్టి మహిళ మృతి

ఆర్టీసీ సమ్మె కాలంలో నడుస్తున్న బస్సులు మరో ప్రమాదానికి కారణమయ్యాయి. ఈ సాయంత్రం ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం.. బాసర పట్టణంలో ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

వేగంగా ట్రిప్పులు నడపడంతో బస్సులో పొగలు

వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ దగ్గర ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చాయి. హన్మకొండ నుండి తరిగొప్పులకు వెళుతున్న బస్సులో పొగలను గమనించిన ప్యాసింజర్లు.. డ్రైవర్ ను అలర్ట్ చేశారు. టెంపరరీ డ్రైవర్ వెంటనే రోడ్డు పక్కకు బస్సు ఆపాడు. బస్సులోని 30 మంది ప్యాసింజర్లు ప్రమాదం తప్పించుకున్నారు. ఉదయం నుండి వేగంగా రెండు ట్రిప్పులు వెళ్లడం వల్లే ఇంజిన్ హీట్ అయి పొగలు వచ్చినట్టు తేలింది. బస్సు దిగిన ప్యాసింజర్లకు మరో బస్సు దొరక్కపోవడంతో..  ఎవరిదారి వారు చూసుకున్నారు.

 

Latest Updates