పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం

యాదాద్రి భువనగిరి: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి మూడు కార్లను ఢీకొట్టింది. ఈ సంఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ముణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పతంగి టోల్‌ ప్లాజా వద్ద ఒక్కసారిగా అదుపుతప్పడంతో ముందువరుసలో ఉన్న మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. సడెన్ గా బస్సు బ్రేక్ ఫెయిలవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపాడు.

అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే తమ కార్లు డ్యామేజ్ అయ్యాయని సీరియస్ అయ్యారు కారు యజమానులు. దీంతో కాసేపు టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Updates