DCM- RTC బస్సు ఢీ : ఐదుగురు మృతి

మెదక్ జిల్లా: ఎదురెదురుగా వస్తున్న RTC బస్సు -డీసీఎం ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. సోమవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం గణపురంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో DCMలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారికి వెంటనే ట్రీట్ మెంట్ కోసం హస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Latest Updates