స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

జగిత్యాల: స్కూల్ బస్సును వెనకనుంచి  ఢీకొట్టింది ఓ ఆర్టీసీ బస్సు. ఈ ఘటన జగిత్యాల జిల్లా  రూరల్ మండలం తాటిపల్లిలో జరిగింది. మెట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్ పల్లి నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరింది. తాటిపల్లికి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న ఓ స్కూల్ బస్సును వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ కు, నలుగురు ప్రయాణికులకు, స్కూల్ బస్సు క్లీనర్ కు గాయాలయ్యాయి. స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు , స్కూల్ బస్సు భారీగా డ్యామేజ్ అయ్యాయి.

ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగుతుండటంతో…  తాత్కాలిక సిబ్బందే బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసీ సమ్మె నడుస్తున్నప్పటినుంచి ఇప్పటికే చాలా చోట్ల బస్సు ప్రమాదాలు జరిగాయి. ఈ విషయంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates