బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ముగ్గురు యువకుల మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కోగిలేరు గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.

జిట్టం పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ (33), ముని చంద్రారెడ్డి (35), రాజా రెడ్డి (32) ముగ్గురు పెద్దపంజాణికి వెళ్లి తిరిగి ఊరికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, ముని కృష్ణారెడ్డి,  చంద్రారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS:

నిద్రపోవడమే జాబ్.. జీతం లక్ష: ఇండియన్స్ అంతా అప్లై చేసుకోవచ్చు

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

Latest Updates