డిఫరెంట్ ఐడియా: ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం రెంటుకు ఆర్టీసీ బస్

ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని వేడుక పెళ్లి. ఆ పెళ్లి కోసం చాలామంది ఉన్నంతలో ఖర్చు పెడుతుంటారు. కేరళలో చాలామంది వధూవరులు తమ పెళ్లి ఫొటోషూట్ కోసం విచిత్రంగా ఆలోచిస్తున్నారు. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు తీసుకొని ఫొటోషూట్లు తీసుకుంటున్నారు. ఈ పద్ధతి ఇప్పుడు కేరళలో బాగా ఫేమస్ అయింది. దాంతో వధూవరుల అవసరాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవాలని కేఎస్ఆర్టీసీ భావిస్తోంది. అందులో భాగంగా డబుల్ డెక్కర్ బస్సులను ఫొటోషూట్ కోసం రెంట్‌కు ఇవ్వాలని నిర్ణయించింది.

‘తాజాగా అక్టోబర్ 21న డబుల్ డెక్కర్ బస్సులో ఒక ఫొటోషూట్ జరిగింది. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చాలామంది బస్ రెంట్ గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బస్ రెంటును రూ. 4 వేలుగా నిర్ణయించాం. రాష్ట్ర రాజధానిలో ఎనిమిది గంటల వ్యవధిలో 50 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు’ అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనీల్ కుమార్ తెలిపారు.

జనవరి 18, 2021న పెళ్లి చేసుకోబోయే గణేష్, లక్ష్మీలు ఫోటోషూట్ కోసం డబుల్ డెక్కర్ బస్సును అద్దెకు తీసుకున్న మొదటి జంటగా నమోదయ్యారు. బస్సు లోపల ఫొటోషూట్‌కు తగినట్లుగా వివిధ వస్తువులను అమర్చారు. ఏజెంట్లు మరియు బస్సులో ఫోటోషూట్ బుక్ చేసుకునే వారికి కూడా ప్రత్యేక కమీషన్ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. డిసెంబర్ చివరిలోపు బుక్ చేసుకున్న వారికి డిస్కౌంట్ కూడా ఇస్తామని ఆర్టీసీ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఈ డబుల్ డెక్కర్ బస్సును ప్రీ-వెడ్డింగ్ షూట్స్ నిర్వహించడానికి మరియు పుట్టినరోజు పార్టీలకు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం మెల్లగా కొచ్చి మరియు కోజికోడ్ వంటి ఇతర నగరాలకు కూడా విస్తరించబడుతోంది.

For More News..

వైరల్ పోస్ట్: పసుపురంగు తాబేలును ఎప్పుడైనా చూశారా?

తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు

సరుకులు తీసుకొని బిల్ కౌంటర్‌కు వెళ్లకుండా ఇంటికెళ్లొచ్చు

Latest Updates