పొలాల్లోకి దూస్కెళ్లి బోల్తా కొట్టిన ఆర్టీసీ బస్సు

కృష్ణా జిల్లాలో ఇవాళ(శనివారం) ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళుతున్న బస్సు పెనమలూరు మండలం చోడవరం దగ్గరకు రాగానే డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేక పోయాడు. దీంతో అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురు తీవ్ర గాయాలు కాగా…మరి కొంత మంది స్వల్పంగా దెబ్బలు తాకాయి. గాయపడిన వారిని వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులున్నారు.

Latest Updates