హైదరాబాద్ శివారులో ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్ : కరోనా కట్టడి క్రమంలో గత 6 నెలలుగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు కొన్ని బుధవారం ఉదయం రోడ్డెక్కాయి. హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలిపారు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో బస్సు సర్వీసులు రోడ్డెక్కాయన్నారు.

శివారులోని ప్రతి డిపో నుంచి 12 బస్సులను నడుపుతున్నామని.. త్వరలోనే సిటీలోనూ బస్సులు నడిపే అవకాశం ఉందన్నారు. 230 ఆర్టీసీ బస్సులను 135 రూట్లలో తిప్పుతున్నట్లు తెలిపారు. సిటీ సబర్బన్ ఏరియాకు 15 కి.మీ. దూరంలో బస్సులను తిప్పుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లోని ప్రయాణికుల రిక్వెస్ట్ మేరకు ఇటీవల జరిగిన ఆర్టీసీ మీటింగ్ లో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.

Latest Updates