వరంగల్ లో 530 బస్సులు నడిపాం…

వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోలకు చెందిన  942 బస్సులకు గాను 530 బస్సులు నడిపించామని అన్నారు ఆర్టీసీ RMశ్రీధర్. బుధవారం వరంగల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… ఉమ్మడి వరంగల్ జిల్లాలో బస్సులను నడిపినట్లు తెలిపారు. వరంగల్ అర్బన్ లో 406 బస్సులకుగాను 206 బస్సులు నడిచాయని.. రూరల్ లో.. 187 బస్సులకు 85, జనగామ జిల్లాలో 119 బస్సులకు 96 బస్సులు, మహబూబాబాద్ జిల్లాలో  154 గాను 112 బస్సులు, జయశంకర్  భూపాలపల్లి జిల్లాలో  76కి గాను 31బస్సులు తిరిగాయని చెప్పారు.

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు: సునీల్‌ శర్మ

ప్రయాణికుల వద్ద అధికచార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని తాత్కాలిక డ్రైవర్లకు, కండక్టర్లను హెచ్చరించారు రావాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ. ఇందుకోసం బస్ స్టాండ్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బస్సుపాస్ లను తప్పనిసరిగా అనుతించాలని చెప్పారు. రేపట్నుంచి డిపోలన్నింటిలో షెడ్యూల్‌ ప్రకారం బస్సులు నడుస్తాయని ఆయన చెప్పారు.

Latest Updates