అర్ధరాత్రి నుంచే బస్సు చార్జీల పెంపు.. కొత్త టికెట్ రేట్లు ఇలా..

ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంటామని నవంబరు 28న ప్రకటించిన వెంటనే బస్సు చార్జీల పెంపు తప్పదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కిలోమీటరుకు 20 పైసల చొప్పున ప్రయాణికులపై అదనపు వడ్డన ఉంటుందని చెప్పారాయన. దీని ప్రకారం సోమవారం నుంచే చార్జీలు పెంచాలని ముందుగా భావించినా.. టికెట్ రేట్ల ఖరారు, టికెట్ మిషన్లలో వాటి అప్ డేట్ వంటి ప్రక్రియ ఉండడంతో ఒక రోజు వాయిదా వేశారు. మంగళవారం నుంచి చార్జీల పెంపు అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అయితే సోమవారం అర్ధరాత్రి రాత్రి 12 గంటల తర్వాత డిపోల నుంచి బయలుదేరే బస్సుల్లోనూ కొత్త చార్జీల ప్రకారం ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు.

సిటీలో రూ.5 చొప్పున బాదుడు

సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జీ రూ.5 నుంచి పది రూపాయలకు పెంచింది ఆర్టీసీ. మెట్రో డీలక్స్ సర్వీసుల్లో రూ.10 నుంచి 15కు పెంచింది. అలాగే టికెట్ చార్జీలన్నీ ప్రస్తుతం ఉన్న వాటిపై రూ.5 చొప్పున పెంచుకుంటూ పోయింది.

పల్లె వెలుగు మినిమం చార్జి రూ.10

పల్లె వెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనీస చార్జీ ఇకపై రూ.10కి పెరుగుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో చార్జీల పెంపు ప్రస్తుతం ఉన్న అన్ని టికెట్లపై రూ.5 చొప్పున పెంచుకుంటూ పోయింది ఆర్టీసీ. ఈ బస్సుల్లో కనీస చార్జీ రూ.15గా ఉంటుంది. డీలక్స్ బస్సుల్లో రూ.20, సూపర్ డీలక్స్ బస్సుల్లో మినిమం టికెట్ రూ.25గా ఉంటుంది. రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్ ఏసీ సర్వీసుల్లో కనీస చార్జీ రూ.35కు పెంచుతోంది ఆర్టీసీ. ఇక వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో మినిమం చార్జ్ రూ.70కి పెంచుతున్నట్లు తెలిపింది.

సమ్మె విరమణ తర్వాత.. ఆర్టీసీ కార్మికుల భేటీలో సీఎం కేసీఆర్ వరాల జల్లు

రంగారెడ్డిలో ప్రేమజంట ఆత్మహత్య

Latest Updates