వనస్థలిపురంలో 2 ఆర్టీసీ బస్సులు ఢీ
V6 Velugu Posted on Jan 23, 2022
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటన ఆదివారం వనస్థలిపురంలో జరిగింది. ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ముందున్న బస్సును మిధాని డిపో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీంపట్నం డిపో బస్ డ్రైవర్, కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రెండు బస్సుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో 60 మంది ప్రయాణికులున్నారు.
Tagged Telangana, accident, RTC, city, Buses