సమ్మెతో కలతచెందిన ఆర్టీసీ కండక్టర్ మృతి

ఆర్టీసీ సమ్మె కారణంగా బ్రేన్ స్ట్రోక్ కు గురైన ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్ పూర్ గ్రామానికి చెందిన మెదక్ డిపో కండక్టర్ షేక్ జాఫర్ (40)కు ఈ నెల 13న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం దిగిరాకపోవడం, రెండునెలలు అవుతున్నా జీతాలు రాకపోవడంతో మనస్థపానికి గురైన జాఫర్ కు బ్రేయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని సంజీవిని హాస్పిటల్ లో జాయిన్ చేయగా…  చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. జాఫర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు జేఏసీ నాయకులు.

Latest Updates