ఉద్యోగం పోయిందని మనస్తాపంతో ఆర్టీసీ కండక్టర్​ ఆత్మహత్య

రాజేంద్రనగర్, వెలుగు: మరో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్​ కుల్సుంపురా పీఎస్ పరిధిలోని కార్వాన్‌లో ఉండే సురేందర్​గౌడ్ రాణిగంజ్–2 డిపోలో 14 ఏళ్లుగా ఆర్టీసీలో కండక్టర్​గా పని చేస్తున్నాడు. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న సురేందర్​ కు డబ్బులు కట్టకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యిందని ఫైనాన్స్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. డ్యూటీ రాదేమోనని మనస్థాపం చెందిన సురేందర్​ గౌడ్ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

కుటుంబసభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేందర్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సురేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

Latest Updates