ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదు : నిరంజన్ రెడ్డి

బూర్గంపహాడ్, వెలుగు: ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేసేదిలేదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని కోరుకొనే వారిలో నేను ఒకడినని అన్నారు.

సమ్మెను ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు, కార్మికులను రెచ్చగొడుతున్నాయన్నారు. ఆర్టీసీని విలీనం చేస్తే వేలమంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సి వస్తుందని దీంతో భవిష్యత్తులో రాష్ట్రంలోని యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వుండవన్నారు. ఆయనతోపాటు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ రజత్ కుమార్ షైనీ తదితరులు ఉన్నారు.

Latest Updates