దారుణం.. భార్యపై డంబెల్‌తో దాడి చేసిన‌ ఆర్టీసీ డ్రైవర్

తూర్పు గోదావ‌రి: కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు లో దారుణం జరిగింది. ఓ భర్త .. భార్యపై డంబెల్‌తో దాడి చేసిన ఘ‌ట‌న‌లో భార్య‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. కొవ్వూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీను చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కొన్నాళ్లుగా భార్య మాధ‌విని వేధిస్తున్నాడు. కొన్ని నెల‌ల క్రితం భార్యపై హత్యాయ‌త్నం చేశాడు. అప్పట్లో బంధువులు అడ్డుకున్నారు. సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలకు అలవాటుపడ్డాడు. కుమార్తెలతో సయితం అసభ్యంగా ప్రవర్తించేవాడు

చివరికి ఉన్మాదిలా మారి బుధవారం రాత్రి భార్య తలపై డంబెల్‌తో బలంగా కొట్టగా.. తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న మాధవి బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తన భర్తకు అధికారపార్టీకి చెందిన ఓ నేత అండగా ఉన్నాడని అందుకే పోలీసులు పట్టించుకోవడం లేదని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం శ్రీను పరారీలో ఉన్నాడు.

Latest Updates