పిల్లల కోసం కూలీగా మారిన ఆర్టీసీ డ్రైవర్

రెండు నెలలుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండంతో కార్మికుల బతుకు అయోమయంగా మారాయి. దీంతో కొందరు కార్మికులు రోజూ వారి కూలీలుగా మారగా, మరి కొందరు వ్యవసాయం చేసుకుని పొట్టనింపుకుంటున్నారు. వరంగల్ జిల్లా నర్మెట మండలం ఇప్పట గడ్డకు చెందిన బానోత్ అంజి అనే అతను ఆర్టీసీలో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రెండు నెలలుగా నడుస్తున్న ఆర్టీసీ సమ్మె వల్ల ఈయన కుటుంబ జీవనం కష్టంగా మారింది. దీంతో సొంత ఊరులోనే వ్యవసాయ కూలీగా మారాడు.  ఇతనికి నలుగురు సంతానం. పెద్ద కొడుకు బీటెక్ చదువుతున్నడు. రెండో కొడుకు ఇంటర్, మూడో కొడుకు టెన్త్, అమ్మాయి సెవెంత్ చదువుతున్నరు. వీరికి ఫీజులు కట్టలేక వ్యవసాయ కూలీగా మారానని అంజి చెప్తున్నడు. న్యాయమైన తమ డిమాండ్ లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తుండు.

Latest Updates