ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కార్మికుల ఆందోళన

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్  వీరభద్రయ్య మృతి చెందాడు. పరిగి బస్సు డిపోలో పని చేస్తున్న వీరభద్రయ్య గత రెండు రోజులుగా మనోవేదనకు గురై గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఆర్టీసీ కార్మికులు వీర భద్రయ్య మృతదేహంతో పరిగి బస్టాండ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.  దీంతో రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పరిగి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుల్కచర్ల మండలం మండిపల్ గ్రామానికి చెందిన వీర భద్రయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Latest Updates