మా నాయనే దొరికిండా మీకు..?

ఆర్టీసీ కార్మికులు రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తున్నరు. సమ్మె చేసే దగ్గర ఎవ్వరున్నా పోలీసులు వ్యాన్​ ఎక్కించేస్తున్నరు. అక్కడే ఉన్న ఓ వ్యక్తినీ అలాగే వ్యాన్​ ఎక్కించబోయిన్రు. తనకు ఆర్టీసీ కార్మికులతో సంబంధం లేదని ఎంత చెప్పినా పోలీసులు వినలె. వెంటనే అతడి కొడుకు రయ్యున అక్కడికి ఉరుకొచ్చిండు. ‘‘ఏం ఇంత మందిలా మా నాయనే దొరికిండా మీకు? మా నాయనకు ఏం తెల్వదు. వదిలిపెట్టుండ్రి” అంటూ పోలీసులతో వాదన పెట్టుకున్నడు ఆ పిల్లోడు. ఎలాగైతేనేం తన నాయన్ను విడిపించుకుపోయిండు. పోలీసులు వ్యాన్​ ఎక్కించబోయిన ఆ వ్యక్తి, రోడ్డు పక్కన పంక్చర్​ షాపును నిర్వహిస్తుంటడు. రోడ్డు మీద కార్మికులు సమ్మె చేస్తుంటే చూడ్డానికి పోయిండు. పోలీసులు అరెస్ట్​ చేయబోయిన్రు.

– వరంగల్​, వెలుగు

Latest Updates