ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం: జగ్గారెడ్డి

ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం వేసిందని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఛార్జీల తగ్గింపు కోసం సంతకాల సేకరణ చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఛార్జీలను తగ్గిస్తామన్నారు. అప్పుల్లో ఉన్న ఏపీ ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదన్నారు. మిగులు రాష్ట్రం తెలంగాణలో మాత్రం ఛార్జీలు పెరిగాయన్నారు జగ్గారెడ్డి.

 

Latest Updates