ఆర్టీసీకి పైసలే పైసలు!

హైదరాబాద్‌ , వెలుగు : తెలంగాణ ఏర్పడ్డ తర్వా త మొదటిసారి ఆర్టీసీకి రికార్డు స్థాయి ఇన్​కం వచ్చింది. సోమవారం ఒక్కరోజే 16.85 కోట్ల రెవెన్యూ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్​ నుంచి సుమారు 25 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లారు. వీరంతా సోమవారం నగరబాట
పట్టా రు. అలాగే కొన్ని చోట్ల జాతరలు జరుగుతుండడంతో కలిసివచ్చింది.

గతంలో రూ.11 కోట్ల నుంచి రూ.11.5 కోట్ల మధ్య ఆదాయం వచ్చేది. ఇటీవల టికెట్‌ చార్జీలు పెంచాక 12.5 కోట్ల నుంచి 13 కోట్ల మధ్య వస్తుంది. పండుగకు స్పెష ల్‌ బస్సులు వేసి అదనపు చార్జీలు వసూలు చేయడంతో ఈసారి సుమారు 4 కోట్ల ఆదాయం పెరిగింది.

see also -ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇయ్యాల పరీక్షే

Latest Updates