అశ్వత్థామ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపటికే వదిలి పెట్టారు.  హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ వరకు కార్మికులు బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు  అశ్వత్థామ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కాసేపటికే ఆయన్ని వదిలేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్వత్థామ రెడ్డి.. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలన్నారు.  రేపటి బంద్ కు  అందరు మద్దతిచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Latest Updates