ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు నేడు ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమానికి పూనుకున్నారు. అన్ని పార్టీల నాయకులు ఒక్కొక్కరుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నారు. నాయకులు అక్కడికి వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన పోలీసులు.. వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. కొంతమంది నాయకులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి మరీ హౌస్ అరెస్టు చేశారు. తాజాగా ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమానికి బయలుదేరిన ఆర్టీసి జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డిని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుల పర్వం కొనసాగుతున్నప్పటికీ నేతలు మాత్రం ట్యాంక్‌బండ్‌కు రావడం మానడం లేదు.

Latest Updates